Home Uncategorized ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Entha Manchivaadavuraa movie review and...

ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Entha Manchivaadavuraa movie review and rating

కథ

కథ

చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలు (కళ్యాణ్ రామ్)ను చుట్టాలందరూ ఒంటరిగా వదిలేస్తారు. అయినా సరే రిలేటివ్స్ అలా వదిలేసినా రిలేషన్స్ మీద ప్రేమను పెంచుకుంటాడు. అవతలి వారికి అవసరమైన రిలేషన్ ఇస్తూ.. తనకు కావాల్సిన ఎమోషన్స్‌ను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికి తమ్ముడు (సూర్య)గా, మనవడు (ఆదిత్య)గా, అన్న (రిషి)గా, కొడుకుగా మారిపోతాడు.

కథలో ట్విస్ట్‌లు

కథలో ట్విస్ట్‌లు

చిన్నప్పటి నుంచీ బాలును ఇష్టపడుతూ వచ్చిన నందిని (మెహరీన్) కథ ఏమైంది? చిన్నప్పుడే జాతరలో తప్పిపోయిన కొడుకుగా శర్మ (తణికెళ్ల భరణి) ఇంటికి వచ్చిన బాలుకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఆ ఊరిలో ఇసుక మాఫిరా రారాజు గంగరాజు (రాజీవ్ కనకాల)తో శత్రుత్వంలో ఎందుకు ఏర్పడింది? నందినిపై ఉన్న ప్రేమను బాలు ఎందుకు బయటకు చెప్పలేకపోతాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఎంత మంచివాడవురా.

ఫస్టాఫ్ అనాలిసిస్..

ఫస్టాఫ్ అనాలిసిస్..

చుట్టాలంటేనే ఇష్టమని, తన పుట్టిన రోజుకు బంధువులందరినీ పిలవమని చెప్పేంత బాలు మంచితనం.. అయితే ఓ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు చనిపోతే మాత్రం ఎవ్వరూ ముందుకు రాకపోవడం, హాస్టల్‌లో పెరగడం లాంటి సీన్లతో కథలో లీనమయ్యేట్టు చేస్తాడు. షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోగా, వాటిని నిర్మించే ప్రొడ్యూసర్‌గా నందిని ఎంటవర్వడం, వారి బ్యాచ్‌తో ఫన్ క్రియేట్ చేయడం లాంటి సీన్లతో ముందుకు సాగుతుంది. అయితే తమకు తెలియకుండా బాలు ఏదో దాచిపెడుతున్నాడని అనుమానం రావడం వాటిని పసిగట్టే ప్రయత్నాలు చేయడం లాంటి సీన్లతో కథలో వేగం పుంజుకుంటుంది. ఒకచోట తమ్ముడి, మరో చోట మనవడిగా, ఇంకో చోట అన్నగా ఎందుకు మారాల్సి వస్తుందో చెప్పడం.. అనతరం వారంతా కలిసి బంధాలను పంచే ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లయర్స్ అనే వెబ్‌పైట్ పెట్టడంతో కథలో జోష్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకరికి కొడుకును, మరొక మనవరాలికి అమ్మమ్మను ఇవ్వడం, ఓ తండ్రికి కొడుకుగా బాలు వెళ్లే సీన్లు, అక్కడ గంగరాజుతో గొడవ పడే సీన్లతో ప్రథమార్థం బాగానే ఆకట్టుకుంటుంది.

సెకండాఫ్ అనాలిసిస్..

సెకండాఫ్ అనాలిసిస్..

అయితే ఇలా ఎమోషన్లను అందించడంలోని ఒక కోణాన్ని చూపించిన దర్శకుడు సెకండాఫ్‌లో రెండో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఓ తాతకు మనవడిగా వెళ్లిన బాలు పేరిట తమ ఆస్తి రాయడంతో గొడవ రావడం, వచ్చిన వాడు సొంత కొడుకు కాదని తండ్రికి తెలియడం.. వేటితోనైనా ఆడుకోవచ్చు గానీ ఎమోషన్లతో ఆడుకోవద్దు, అంగట్లో అన్ని దొరుకుతున్నాయ్..ఒక్క బంధుత్వాలు తప్పా అని తనికెళ్ల భరణి చెప్పడం లాంటి సీన్లతో సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీతో సెకండాఫ్ తెలియని ఫీల్ ఏర్పడుతుంది. మున్నార్ ఎపిసోడ్, సుహాసిని-శరత్ బాబు ఎమోషన్స్ ఇలా చకచకా సాగిపోవడం బాగుంటుంది. చివరకు నందిని-బాలు పెళ్లికి వాళ్ల అమ్మ ఒప్పుకోవడంతో ఆ ఇద్దరి కథ కూడా సుఖాంతం కావడం, చివర్లో గంగరాజు మళ్లీ ఎంట్రీ ఇవ్వడం, ఓ ఫైట్ సాగడం, హాస్పిటల్‌లో ఎమోషనల్ సీన్స్ ఇలా సెకండాఫ్‌ను కొంత సాగదీసినట్టు అనిపించినా ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్..

నటీనటుల పర్ఫామెన్స్..

ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్‌ను చూశాక నిజంగానే ఎంత మంచి నటుడివిరా అనే ఫీలింగ్ కలగవచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి అందిర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యాక్షన్ సీన్స్‌లోనూ తన మాస్ పవర్‌ను చూపించాడు. ఇక మెహరీన్ కూడా అందంగా కనిపించడమే కాదు.. నటించే ప్రయత్నం కూడా చేసింది. తనికెళ్ల భరణి, విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని లాంటి వారు తమ అనుభవంతో వారి పాత్రలను మెప్పించారు. కమెడియన్లుగా వెన్నెల కిషోర్, సుదర్శన్, ప్రవీణ్, భద్రం లాంటి వారు బాగానే నవ్వించారు.

దర్శకుడి పనితీరు..

దర్శకుడి పనితీరు..

కుటుంబ కథా చిత్రాలను తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి లాంటి చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటారు. భారీ తారాగణంతో, తెరపై ఓ నిండుదనం తీసుకొచ్చేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎంత మంచివాడవురా చిత్రంలో ఏ సీన్ చూసినా తెరపై ఓ నిండుదనం, ఓ ఎమోషన్, లోతైన సంభాషణ ఇలా ఏదో ఒకటి ఉండేలా చూసుకున్నాడు. గుజరాతీ కథే అయినా.. ఇక్కడి బంధాలు, బంధుత్వాలు, మనస్తత్వాలు, వాతావరణానికి తగ్గట్టు ఓ చక్కటి తెలుగు సినిమాను చూశామనే ఫీలింగ్‌ను కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు

సాంకేతిక నిపుణుల పనితీరు

ఎంత మంచివాడవురా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది గోపీ సుందర్ సంగీతం. ఎంతో ఆహ్లాదకరమైన, వినసొంపైన బాణీలను అందించాడు. పల్లెటూరి అందాలను తన కెమెరాలో మరింత అందంగా బంధించాడు కెమెరామెన్ రాజ్ తోట. ద్వితీయార్థాన్ని ఇంకాస్త తగ్గించే ప్రయత్నం ఎడిటర్ తమ్మిరాజు చేస్తే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నిర్మాతలుగా తమ మొదటి ప్రయత్నమే అయినా.. ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. ఆర్ట్ విభాగం పనితీరు కూడా చక్కగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

నందమూరి కళ్యాణ్ రామ్
నటీనటులు
కథ
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
ఆసక్తికరంగా సాగని కథనం

ఫైనల్‌గా..

ఫైనల్‌గా..

ఈ సంక్రాంతికి ఎలాంటి గొడవలు, అరమరికలు లేని ఓ చక్కటి అనుభూతిని పొందేందుకు ఎంత మంచివాడవురా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం అంతగా మెప్పించకపోవచ్చు. కమర్షియల్‌గా కూడా ఎంత మంచివాడవురా అని అనిపించుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం.

నటీనటులు

నటీనటులు

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ పిర్జాడా, తనికెళ్ల భరణి, శరత్ బాబు, సుహాసిని తదితరులు
దర్శకత్వం : సతీష్ వేగేశ్న
నిర్మాత : ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
బ్యానర్ : ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్
మ్యూజిక్ : గోపీ సుందర్
సినిమాటోగ్రఫి : రాజ్ తోట
ఎడిటింగ్ : తమ్మిరాజు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here